ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగన డిజిటల్ టీమ్ స్పందిస్తూ... సినీ నేపథ్యం లేకుండా వచ్చినవారు కూడా మూవీ మాఫియా దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటున్నారని వ్యాఖ్యానించింది. తాప్సీ నిన్ను చూసి సిగ్గుపడుతున్నామని పోస్ట్ చేసింది.ఈ వ్యాఖ్యలపై తాప్సీ స్పందిస్తూ... కొందరు వ్యక్తులు మంచిలో కూడా చెడును చూస్తారని వ్యాఖ్యానించింది. అలాంటి వారి పట్ల కూడా మనం మంచిగానే ఉండాలని... వారి గురించి ప్రార్థనలు చేద్దామని చెప్పింది. మన ప్రవర్తన ఎలా ఉండకూడదో వారిని చూసి తెలుసుకోవాలని తెలిపింది.