వివాహ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకముందని చెబుతోంది అందాల కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'వివాహ వ్యవస్థ మీద, ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం వుంది. ఇక నాకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే, మంచి పొడగరి అయివుండాలి. ఎంత పొడగరి అంటే, నేను హైహీల్స్ వేసుకున్నా అతనే పొడుగ్గా వుండాలి. అలాగే, మంచి తెలివైన వాడై వుండాలి..' అంటూ కొన్ని లక్షణాలతో కూడిన ఓ లిస్టును మన ముందు పెట్టింది రకుల్.