మీరు విన్నది నిజమే.. ఇప్పుడు రాజమౌళి హీరోయిన్ ఒకరు పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. రాజమౌళి సినిమాలో నటించలేదు కానీ ఒక అవకాశం మాత్రం దక్కించుకుంది. ఆ తర్వాత అనుకోని కారణాలతో సినిమా నుంచి తప్పుకుంది. అయినా కూడా రాజమౌళి హీరోయిన్ ముద్ర పడిపోయింది. దర్శకధీరుడు ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ కు జోడీగా ముందు ఒక హాలీవుడ్ హీరోయిన్ ని తీసుకున్నాడు. ఆమె పేరు ఎమ్మా రాబర్ట్స్. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల తో సినిమా నుంచి తప్పుకుంది రాబర్ట్స్. దాంతో ఆమె ప్లేస్ లో ఒలీవియా మోరిస్ ను తీసుకున్నాడు రాజమౌళి.
ఇదిలా ఉంటే ఎమ్మా ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆమె ప్రస్తుతం గర్భవతి. దాంతో రాజమౌళి సినిమా నుంచి తప్పుకుంది. అయితే ఆమె గర్భం దాల్చినా పెళ్లి మాత్రం కాలేదు. తన బాయ్ ఫ్రెండ్ గ్యారేట్ హెడ్ లాండ్ తో కొంత కాలం నుంచి సహజీవనం చేస్తోంది ఎమ్మా రాబర్ట్స్. దాంతో ఆమె గర్భవతి అయింది. కొన్ని రోజులు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచి పెట్టినా.. ఈ మధ్యే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తన కూతురు గర్భవతి అని.. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిబోతుందని ఎమ్మా రాబర్ట్స్ తల్లి మీడియాతో తెలిపింది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెన్సీ వార్త హాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. జూలైలోనే ఆమె ప్రసవించే అవకాశం ఉంది.