హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ తన పెళ్లి గురించే అడుగుతున్నారని, తాను పెళ్లి చేసుకున్నా వారికి ఇబ్బందేనని, పెళ్లి చేసుకోకపోయినా ఇబ్బందేనని సరదాగా వ్యాఖ్యానించారు. తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో తాను విసిగిపోయానన్నారు. వీటన్నింటిక సమాధానంగా "పెళ్లిగోల" అనే సినిమా టైటిల్ తో సినిమా తీస్తానన్నారు.