ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లతో రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ ఫస్టులుక్ కు తక్కువ సమయంలోనే అధిక ట్వీట్లు వచ్చాయి. సింగిల్ హ్యాష్ ట్యాగ్ తో 3.8 మిలియన్లు, 24 గంటల్లో 6.3 మిలియన్లకు పైగా ట్వీట్లు వచ్చాయి. ప్రస్తుతం ఇది సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.