ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో బిజీగా ఉన్న కోహ్లి ఈ సిరీస్‌లో దుమ్మురేపుతున్నాడు. 25 ఏళ్ళ తర్వాత తన కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా గడ్డపై సిరీస్ సాధించి పెట్టాడు. అయితే ఒకవైపు మ్యాచ్‌లతో బిజీగా ఉన్నప్పటికి, తన అర్ధాంగి అనుష్క నటించిన తాజా చిత్రంపై చాలా ఆసక్తి కనబరుస్తున్నాడు విరాట్. ఇటీవల ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించిన కోహ్లి తాజాగా తన ట్విట్టర్లో పరి సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానంటూ ట్వీట్ చేశాడు. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అనుష్క నటించిన పరి సినిమా చూడటానికి ఆగలేకపోతున్నాను. గతంలో ఎప్పుడు కనిపించని అవతారంలో అనుష్క కనిపించనుంది.
ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని విరాట్ అన్నాడు. పరి చిత్రం ప్రోసిత్ రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. పరంభ్రత చటర్జీ, రజత్ కపూర్, రితబ్రయ్ చక్రవర్తి ముఖ్య పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 2న విడుదల కానుంది. హరర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో స్పెషల్ ఎఫెక్ట్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ మూవీ లో అనుష్క నటించడమే కాదు.. ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా తనే. ఇంతకు ముందు ఎన్ హెచ్ 10, ఫిల్లౌరి మూవీ లకు ప్రొడ్యూసర్ గా ఉంది అనుష్క. సుయి ధాగా అనే చిత్రంతోను బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. శరత్ కఠారియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు షారూఖ్ మరుగుజ్జు గా నటిస్తున్న జీరో మూవీలోనూ నటిస్తున్నది అనుష్క. సంజయ్ దత్ బయోపిక్ లోనూ ఓ చిన్న పాత్ర చేస్తుంది .