టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే కొందరికి ఒక రేంజ్ లో డిమాండ్ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే నటులు కొందరు ఉంటారు. వారికి ఇక్కడ అక్కడ కూడా డిమాండ్ అనేది ఉంటుంది. ఇక హీరోయిన్ ల విషయంలో కూడా ఇదే నిజమే. వారు తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా ఒక రేంజ్ లో ఆఫర్లతో దూసుకుపోయే వాతావరణం ఉంటుంది అనే మాట వాస్తవం. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ శ్రద్దా కపూర్. ప్రభాస్ తో కలిసి ఆమె ఒక సినిమా చేసింది. ఆ సినిమా హిట్ కాలేదు.
సాహో అనే టైటిల్ తో వచ్చిన ఆ సినిమా భారీ బడ్జెట్ తో వచ్చినా సరే ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. అయినా సరే ప్రభాస్ ఇప్పుడు శ్రద్దా కపూర్ కు అవకాశం ఇవ్వడానికి గానూ రెడీ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ త్వరలోనే ఒక సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ నటించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఆమె భారీగా డిమాండ్ చేసినా సరే చిత్ర యూనిట్ ఇవ్వడానికి గానూ రెడీ అయింది అని టాక్.
శ్రద్దా కపూర్ కోసం ప్రభాస్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అని సమాచారం. ఆమె త్వరలోనే ఒక ప్రాజెక్ట్ ని తెలుగులో చేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ ఇదే అనేది బాలీవుడ్ జనాల మాట. టాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ ఉంది అని యువత లో మంచి ఫాలోయింగ్ ఉంది అని సినీ పరిశీలకులు కూడా గత కొన్ని నెలలుగా అంటున్నారు.