ప్రియా ప్రకాష్ వారియర్.. ఆమె ఇంత వరకూ ఒక్క మూవీలో కూడా నటించలేదు.. కనీసం ఆమె ఎవరో కూడా తెలీయదు.. ఆమె మలయాళంలో ఒరు ఆదార్ మూవీతో అరంగేట్రం చేస్తున్నది.. ఈ మూవీకి ఒమర్ లులు దర్శకుడు.. తాజాగా ఈ మూవీలోని ఒక సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ టీజర్ లో కేవలం 20 సెకన్లు మాత్రమే కనిపించిన ప్రియా ప్రకాష్ ఏకంగా మాయ చేసింది.. కళ్లతోనే ప్రేమ రాగాలు పలికించి యూత్ గుండెల్లో మంటలు రేపింది.. అలాగే మరో టీజర్ లో వేళ్లతో పెదాలను తాకి దానిని ముద్దుగా మార్చి వదిలింది.. అంతే యూత్ అంతా ఇప్పుడు ఆమె నామస్మరణం చేస్తున్నారు.. ప్రియా నటన మన టాలీవుడ్ నిర్మాత, దర్శకుల కన్ను పడింది.. పెళ్లి చూపులు మూవీ దర్శకుడు తన మూడో మూవీని నిఖిల్ తో చేయనున్నాడు.. ఈ మూవీ కోసం ప్రియా ప్రకాష్ ను తీసుకోవాలని భావించి ఆమెను కాంటాక్ట్ చేశాడట.. ప్రస్తుతం ఆమె కాల్ షీట్స్ వ్యవహారాలు చూస్తున్న ఒరు ఆదార్ దర్శకుడు ఒమర్ లులు ఆమె నటించాలంటే జెస్ట్ రెండు కోట్ల రూపాయిలు పారితోషికం ఇవ్వాలని కోరాడట.. దీంతో షాక్ తిన్న తరుణ్ భాస్కర్ మౌనంగా ఉండిపోయాడట..