ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేయాలని ఉంది

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 05:20 PM



స్టార్‌ హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించేకంటే…చిన్న చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేయడమే ముద్దంటోంది బాలీవుడ్‌ బ్యూటీ జరైన్‌ ఖాన్‌. సల్మాన్‌ లాంటి టాప్‌ స్టార్‌ సరసన సోలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన జరైన్‌కు ఆ తర్వాత కాలం కలిసి రాలేదు. కత్రీనా కైఫ్‌ పోలికలతో పాటు, లావుగా ఉంటుందనే వంకలతో చిత్రాలు తగ్గిపోయాయి. హౌస్‌ ఫుల్‌ 2, రెడీ సినిమాల్లో వచ్చిన అవకాశాలు ఆమెను కేవలం ఒక అతిథిగానే చూపించాయి. ఈ నేపథ్యంలో జరైన్‌ ఖాన్‌ స్పందించింది. ఆమె మాట్లాడుతూ…స్టార్‌ చిత్రంలో చిన్నపాత్రలు చేయడం ద్వారా నాకు దక్కుతున్న గుర్తింపు చాలా తక్కువ. అప్రాధాన్య పాత్రలకు పరిమితమైపోతున్నాను. వాస్తవానికి నా తొలి చిత్రమే గొప్ప అవకాశం. ఈ చిత్రం సరిగా ఆడకపోవడం వల్ల సోలో నాయికగా నిలబడలేకపోయాను. మరో నాయిక (కత్రీనా) లా ఉంటాననే పేరూ చెడు చేసింది. లావుగా ఉండటం వల్ల మరికొన్ని అవకాశాలు చేజారాయి. హౌస్‌ఫుల్‌ 2 చిత్రంలో నలుగురు నాయికల్లో ఒకరిని కాబట్టి….అందులో పేరు తెచ్చుకోలేకపోయాను. కాబట్టి చిన్న చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేయాలని భావిస్తున్నాను అని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com