బాలీవుడ్ ప్రేమ జంట రణవీర్ సింగ్, దీపికా పడుకోణేలో సంజయ్ లీలా భన్సాలీతో రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాలు చేశారు తాజాగా దీపిక , రణ్వీర్సింగ్లు సంజయ్ దర్శకత్వంలోనే మరో మూడు చిత్రాల్లో నటించనున్నారట. దీనికి సంబంధించి వారి మధ్య డీల్ కూడా కుదిరిందని టాక్. వారిద్దరి నటన మాత్రమే కాక ప్రొఫెషన్ పట్ల వారి అంకితభావానికి ఆయన ఫిదా అయిపోయారని, అందుకే వారితో మళ్లీ కలిసి పనిచేయాలని ఆయన డిసైడ్ అయ్యారట. పద్మావత్ సినిమా షూటింగ్కు, ఆ చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదురైనప్పుడు వారు ఎంతో సహనంతో సహకరించడం భన్సాలీకెంతో నచ్చిందట. అందువల్ల వారిద్దరితో ఆరేళ్ల పాటు మూడు సినిమాలకు ఆయన డీల్ కుదుర్చుకున్నారట.