`ఫిదా`, `తొలిప్రేమ` వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలతో మంచి జోష్‌లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన `తొలిప్రేమ` భారీ విజయాన్ని అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా నటుడిగా కూడా వరుణ్‌ను మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి వరుణ్ మాట్లాడాడు.
`ప్రస్తుతం నా వయసు 27 ఏళ్లు మాత్రమే. ఇప్పటికి నా ప్రేమ సినిమాల మీదనే. ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించడానికి కూడా సమయం లేదు. నా కంటే ముందు ప్రభాస్, నితిన్ వంటి హీరోలు ఉన్నారు. వారి పెళ్లిళ్లు అయిపోయిన తర్వాతే నా వివాహం` అని వరుణ్ బదులిచ్చాడు. గత రెండు సినిమాల్లో లవర్‌బాయ్‌గా కనిపించిన వరుణ్.. త్వరలో వ్యోమగామిగా కనిపించనున్నాడు. `ఘాజీ` సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో వరుణ్ వ్యోమగామిగా కనబడబోతున్నాడు.