ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ఓ కొత్త యాక్టర్‌ దొరికాడు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 03:29 PM



సంచలన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘తన ట్వీటర్‌ అకౌంట్‌లో అక్కినేని నాగార్జున ఫొటోలు రెండు పోస్టు చేశాడు. ఈ రోజునే (ఫిబ్రవరి 16న) నా మొదటి సినిమా శివ తొలి రోజు చిత్రీకరణ చేశాం. ఈ సందర్భంగా నా బ్రాండ్‌ హీరో నాగార్జున ఫొటోలు ఇదిగో. 25 సంవత్సరాల అన్వేషణ తర్వాత నాకు ఓ కొత్త  యాక్టర్‌ దొరికాడు. అతనేవరో కాదు.. అక్కినేని నాగార్జునే. ఇంతకముందు చూడని రియలిస్టిక్‌ యాక్షన్ హీరోను నాగార్జునలో చూస్తారు’ అని వర్మ ట్వీట్‌ చేశారు.


యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వర్మ కంపెనీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్‌ ఓ పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com