ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ సినిమాలో రాశి ఖన్నా ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 04:37 PM



ఊహలు గుసగుసలాడే సినిమాతో సైలెంట్ గా టాలీవుడ్ లోకి వచ్చిన రాశి ఖన్నా ఇప్పుడు చాలా స్పీడ్ అయిపొయింది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ చబ్బీ గర్ల్ ప్రేమ తరహా కథలకు బాగా సెట్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన తొలిప్రేమ సినిమాలో నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. దానికి తన అందాన్ని కూడా ఓ లిమిట్ లో యాడ్ చేసి లిప్ లాక్ తో స్పెషల్ అనుభూతిని ఇచ్చింది. 


ఇక అసలు విషయానికి వస్తే అమ్మడికి ప్రస్తుతం ఆఫర్స్ చాలానే అందుతున్నాయట. కానీ రాశి మాత్రం మునుపటి లాగా కాకుండా కేవలం కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఒకే చేస్తోంది. రీసెంట్ గా ఓ రెండు మూడు కథలు విన్న రాశి నితిన్ చేస్తోన్న కథకు ఒకే చెప్పేసిందని టాక్ వస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించబోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నితిన్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే అందులో రాశి ఖన్నా ని ఫైనల్ చేసినట్లుగా రూమర్ వస్తోంది. 


ఇంతకుముందు చలో ఫేం రష్మిక మందానను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టుగా చిత్ర యూనిట్ నుంచి టాక్ వచ్చింది. దాదాపు ఆమెనే ఫైనల్ చేశారని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. కానీ రీసెంట్ గా మళ్లీ దర్శక నిర్మాతలు ఆమె వైపు మనసు మళ్లించినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. మరి ఎవరు నటిస్తున్నారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com