నేను చాలా అదృష్టవంతురాల్ని. కెరీర్ తొలినాళ్లలోనే ఎంతో అనుభవమున్న నటులతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని తెలిపింది బాలీవుడ్ నటి కత్రినాకైఫ్. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. దీంతో వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. అనుభవమున్న నటులతో నటించడమే కాదు వాళ్లను దగ్గరగా గమనించినా చాలా విషయాలు వాటంతట అవే వచ్చేస్తాయి అని చెప్పింది. కత్రినా ఇక్కడి అమ్మాయి కాకపోయినా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. దీని వెనుక భారీ ప్రణాళిక ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రణాళిక వేసుకొని ఉంటే ఎదిగేదాన్ని కాదంటోంది. జీవితం అలా ఉండాలి… ఇలా ఉండాలి అంటూ ప్రణాళికలు వేసుకోకూడదనే విషయాన్ని ఎప్పుడో నేర్చుకున్నాను. ప్లాన్స్ వేసుకోవడానికే సమయం అంతా కేటాయిస్తే జీవితం అంతే సంగతులు. నిజాయతీగా పనిచేస్తే ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడని పేర్కొంది.