ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనతారనే వెనక్కి నెట్టేసి సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్..?

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 12:48 PM



పట్టుమని పది సినిమాలు చేయలేదు, హీరోయిన్‌గా అంత క్రేజ్‌ కూడా లేదు... అయినా దక్షిణాది అగ్రతార నయనతారనే వెనక్కి నెట్టేసి సంచలనం సృష్టించింది ఓవియా. ఆమె మాతృభాష మలయాళం అయినా ‘కలవాణి’తో కోలీవుడ్‌కు పరిచయమై, ఇక్కడే సెటిలైపోయింది. హీరోయిన్‌గా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తుండడంతో దాదాపుగా రేసులో నుండి తప్పుకుంది. ఆ సమయంలో ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో ఆమె పాలిట వరంలా మారింది. గతేడాది ప్రసారమైన ఈ షో పుణ్యమాని ఓవియా క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఎంతగా అంటే.. కోలీవుడ్‌ యూత్‌ అంతా ఇప్పుడు ఆమె వెనుకే పడుతున్నారు.


 తాజాగా దక్షిణాదిలో టాప్‌ 30 హీరోయిన్ల గురించి ఒక సంస్థ జరిపిన సర్వేలో.. ఓవియాకు తొలి స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అగ్రస్థానంలో ఉన్న నయనతార రెండో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, 4వ స్థానంలో శ్రద్ధా, 5వ స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ నిలిచారు. అయితే ‘మైనా’ భామ అమలాపాల్‌, ముంబై బ్యూటీ హన్సిక వరుసగా 13, 16 స్థానాల నుండి 28, 30 స్థానాలకు పడిపోయారు. ఈ లిస్టులో హన్సికనే ఆఖరులో నిలవడం గమనార్హం. సర్వే గురించి ఓవియా దగ్గర ప్రస్తావిస్తే.. ‘అయ్యో.. నాకు అస్సలు నమ్మబుద్ధికావడం’ అని ఎగిరి గంతేసిందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com