టాలీవుడ్ పై హీరోయిన్ రాధ చెరగని ముద్ర వేసింది.. డ్యాన్స్ ల్లో మెగా స్టార్ తో పాటు వేసి మెప్పించిన నటి.. అలాగే గ్లామర్ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్ కూడా ఆమె.. మూవీల నుంచి దూరంగా ఉంటున్న రాధ తన వారసత్వంలో కుమార్తె కార్తీకను దించింది.. ఎన్టీఆర్ మూవీ దమ్ము సినిమాలో కార్తీక మెరిసింది.. ఆ తర్వాత తమిళ, కన్నడ, తెలుగు మూవీల్లోనూ నటించింది.. అయితే ఆమెకు ఏ ఒక్క మూవీ బ్రేక్ తీసుకురాలేకపోయింది.. తల్లి రాధలా అకర్షించే రూపం లేకపోవడం అమెకు పెద్ద మైనస్ అనే టాక్ కూడా వచ్చింది.. ఇప్పడు కొత్త అవతారంతో కార్తీక వచ్చేస్తోంది.. అందాలు ఆరబోస్తే తప్ప పాత్రలు రావని గ్రహించిన ఈ భామ ఫోటో షూట్ లకు తెర లేపింది. గ్లామర్ షో కి రెడీ అంటూ స్కిన్ షో పోటోలను వదిలింది.. మరి ఈ ఫోటోలను చూసి ఎవరైనా చాన్స్ లిస్తారో లేదో చూడాలి మరి..