ఎప్పుడూ హాట్‌గా కనిపించే శృంగార తార సన్నీ లియోన్ ఇప్పుడు కొత్తగా తనలోని మరో కోణాన్ని చూపించాలనుకుంటోంది. నటిగా తనేంటో రుజువు చేయాలనుకుంటోంది. ఈ మధ్యే సన్నీ ప్రధాన పాత్రలో వీరమహాదేవి అనే చారిత్రాత్మక చిత్రం ప్రారంభమైంది. కత్తి పట్టిన వీర నారిగా కనిపించబోతోందామె. ఐతే దానికంటే ముందు ఒక హార్రర్ సినిమాలో వయొలెంట్ రోల్ చేస్తోంది సన్నీ.ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో పాట బయటికి వచ్చింది. ఆ పాటలో సన్నీ అవతారం చూసి జనాలు షాకైపోతున్నారు. అందులో దయ్యంలా వికారంగా కనిపిస్తోంది సన్నీ. పళ్లు ఊడిపోయి.. కోరల్లాగా రెండు పళ్లు బయటికి వచ్చి భయంకరంగా ఉందామె. ఎప్పుడూ శృంగార దేవతలా కనిపించే సన్నీ.. ఇలాంటి అవతారంలోకి మారేసరికి జనాలు షాకవుతున్నారు. సన్నీ నిన్నిలా చూడలేం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.