టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం యూటర్న్. కన్నడ చిత్రం యూటర్న్ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ రూపొందుతున్నది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, ఆదిపినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే రాజమండ్రిలో మొదలైంది. పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకుడు. సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. ఓ ఫ్లైఓవర్‌పై జరుగుతున్న వరుస అత్మహత్యల వెనకున్న నిజానిజాలేమిటో తెలుసుకునే జర్నలిస్టుగా కనిపించనుంది సమంత. క సమంతపై ఫ్లైఓవర్ కు సంబంధించిన సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. సమంత మూవీ లొకేషన్స్ లో ఉన్న ఫొటోలు విడుదలయ్యాయి.. స్కూటర్ పై వెళుతున్న సమంత ఫోటోలు ఇప్పడు వైరల్ అవుతున్నాయి..