పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్టు ఎవరి అభురుచి వాళ్లది. అయితే ఆ అభురుచి సోషల్ మీడియాకు ఎక్కితే మాత్రం విమర్శలు తప్పవు. టీవీ సెలబ్రిటీ, నటి నియా శర్మ తాజాగా చేసిన పని ట్రోలింగ్‌కు గురవుతోంది. అసభ్య పదజాలంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.
నియా శర్మ గురువారం తన 30వ జన్మదినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అయితే బర్త్ డే కోసం తెచ్చిన కేక్ అసభ్యంగా ఉంది. పురుషాంగాన్ని పోలిన డిజైన్‌తో ఉన్న కేక్‌ను నియా శర్మ కట్ చేసింది. అంతటితో సరిపెట్టకుండా ఆ ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకున్నారు. ఆమె `డర్టీ` సెలబ్రేషన్స్‌కు అంతకంటే డర్టీగా బదులిచ్చారు.