ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమాల్లో జయప్రద బిజీ బిజీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 11:13 AM



దశావతారం సినిమాలో కమల్‌హాసన్‌తో కలిసి నటించి.. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైంది అలనాటి అందాల హీరోయిన్ జయప్రద. రాజకీయాలతో బిజీబీజీగా ఉన్న జయప్రద ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో గ్రాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై రీఎంట్రీకి రెడీ అయింది. ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో నటించిన శరభ, సువర్ణ సుందరి సినిమాలు ఈ వేసవిలో విడుదల కానున్నాయి. వీటితోపాటు తమిళం, మలయాళంలో నటించిన రెండు మూవీస్ ఫిబ్రవరి 23న విడుదలవుతున్నాయి. హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కొత్త డైరెక్టర్లతో కలిసి సినిమాలు కూడా చేస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com