ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బిగ్ బాస్' వల్ల 'జబర్దస్త్'‌ లో మార్పులు.. ఎందుకంటే..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 24, 2020, 03:38 PM



జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్య ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అవసరానికి తగ్గట్లుగా టీమ్ లీడర్స్‌తో పాటు ఇంకా చాలా మార్పులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలక మార్పు కూడా చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ జబర్దస్త్ కామెడీ షోలో ఉన్న అవినాష్.. ఇప్పుడు బిగ్ బాస్ షోకు వచ్చాడు. దానికి ముందు జబర్దస్త్‌లో ఈయన టీమ్ లీడర్. కార్తిక్‌తో కలిసి ఓ టీం ఫామ్ చేసాడు అవినాష్. మాస్ అవినాష్ కెవ్వు కార్తిక్ పేరుతో ఓ టీమ్ గత నాలుగేళ్లుగా రన్ చేస్తున్నారు ఈ జోడీ. అయితే ఇప్పుడు అవినాష్ బిగ్ బాస్‌కు వెళ్లడంలో ఓ టీమ్ లీడర్ కుర్చీ ఖాళీ అయిపోయింది.
దాంతో దాన్ని భర్తీ చేసే పనిలో బిజీ అయిపోయారు జబర్దస్త్ నిర్వాహకులు. ఇప్పటి వరకు ఇద్దరు టీమ్ లీడర్స్ ఉంటే ఇప్పుడు దాన్ని సోలో చేసారు. మాస్ అవినాష్ బిగ్ బాస్‌లో బిజీ కావడంతో కెవ్వు కార్తిక్‌ను సోలో టీం లీడర్‌గా చేసారు. ఈ మార్పుతో చాలా కాలంగా కలలు కంటున్న కార్తిక్‌కు సోలో టీమ్ లీడర్ పదవి వచ్చినట్లైంది. రేటింగ్స్ బాగా వస్తే అవినాష్ వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తారేమో చూడాలి. ఇప్పటి వరకు అయితే అవినాష్ లేకపోయినా కూడా ఆ లోటు లేకుండా తన పని తాను చేసుకుంటున్నాడు కెవ్వు కార్తిక్. తొలి స్కిట్‌లోనే సోలో టీమ్ లీడర్ అయ్యానంటూ ప్రమోషన్ చేసుకుంటున్నాడు ఈయన.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com