ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళ సినీ హీరో విజయకాంత్ కు కరోనా పాజిటివ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 24, 2020, 06:38 PM



ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ కాంత్‌ కు కరోనా మహమ్మారి సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క, తమ అభిమాన హీరోకు కరోనా సోకడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయకాంత్ ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగా, ఆ సమయంలోనే వైరస్ ఎవరి నుంచో అంటుకున్నట్టు తెలుస్తోంది. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com