ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిచాతో ప్రియదర్శి పెళ్లి ముహూర్తం

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 02:45 PM



పెళ్లి చూపులు సినిమాలో హీరో హీరొయిన్ విజయ్ దేవరకొండ రీతు వర్మలతో సమానంగా పేరు తెచ్చుకున్న కమెడియన్ ప్రియదర్శి ఈ వారమే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. మొన్న వాలెంటైన్ డే రోజు తన ప్రేమను వినూత్నంగా సోషల్ మీడియా సాక్షిగా ఎక్స్ ప్రెస్ చేసి అందరికి తన లవర్ ని పరిచయం చేసిన ప్రియదర్శి గ్యాప్ తీసుకోకుండా తన ప్రేయసితో జీవితాన్ని పంచుకోబోతున్నాడు. ఈ శుక్రవారం ఫిబ్రవరి 23న హైదరాబాద్ లోని ఆగ్రా కాంట్ ప్రాంతంలోని గ్రాండ్ హోటల్ లో ఘనంగా చేసుకోబోయే వివాహ వేడుకకు రమ్మని ఆహ్వానిస్తూ వెడ్డింగ్ కార్డును కూడా షేర్ చేసుకున్నాడు ప్రియదర్శి. వధువు రిచా శర్మకు జతగా మారబోయే తమ కథకు సాక్ష్యంగా ఉండడానికి రమ్మని ఆహ్వానించాడు.


దాని తర్వాత మూడు రోజుల గ్యాప్ లోనే రిసెప్షన్ కూడా ప్లాన్ చేసాడు. 26వ తేది పెళ్లి జరిగిన సమయంలోనే సాయంత్రం 7 గంటలకు నరేన్ గార్డెన్స్ లో విందు ఏర్పాటు కూడా కార్డులో ఉంది. మూడు రోజుల గ్యాప్ లో రెండు వేడుకలు చేసుకోబోతున్న ప్రియదర్శి వీటి కోసం షూటింగ్స్ నుంచి రెండు వారాలు బ్రేక్ తీసుకున్నట్టు తెలిసింది. పెళ్లి చూపులు సినిమా తర్వాత అందులో నటించిన ఆర్టిస్టులు అందరిలోకి బిజీగా మారిన ప్రియదర్శి తన జీవితంలో తెరవబోయే కొత్త పేజీకి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాడు.


పేరుకి హాస్య నటుడే అయినా ప్రియదర్శిలో మంచి భావుకుడు - ప్రేమికుడు ఉన్నాడని ప్రేమికుల రోజు సందర్భంగా రిచాకు రాసిన ప్రేమ కవిత ద్వారా బయట పెట్టుకున్న ప్రియదర్శి అందులో తామిద్దరూ కలిసి ఉన్న బ్యాక్ గ్రౌండ్ నే పెళ్లి శుభలేఖ కోసం కూడా వాడుకున్నాడు. తక్కువ టైంలోనే మంచి స్పీడ్ తో దూసుకుపోతున్న ప్రియదర్శి పెళ్లి జరిగాక సినిమాల్లో హీరో అయినా అవుతాడు అంటున్నారు అతని స్నేహితులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com