సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఎకౌంట్స్ హ్యక్ కావడం, వారి పేరుతో ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ చేయడం సాధారణంగా జరుగుతూ వస్తుంది. తాజాగా మలయాళ నటి మంజూ వారియర్ పేరుపై కొన్ని ఫ్రాడ్ ఎకౌంట్స్ క్రియేట్ అయ్యాయి. ఈ విషయంలో తన ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్ జాగ్రత్తగా ఉండాలంటూ ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం నేను వెరిఫైడ్ ఫేస్ బుక్ పేజ్ని మాత్రమే వాడుతున్నాను. నా పేరుతో ఉన్న ఫ్రాడ్ ఎకౌంట్స్‌ని అస్సలు నమ్మోద్దు అంటూ తన ఫేస్ బుక్ పేజ్‌లో ఫేక్ ఎకౌంట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ విషయాన్ని వివరించింది. గతంలో మంజు వారియర్ ఫేస్ బుక్ పేజ్‌లో ట్రైనీ పోలీస్ (సివిల్)అధికారి కేఎం రెంజుమన్ అసభ్యకరమైన కామెంట్లు పోస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంజువారియర్ కేరళ డీజీపీ టీపీ సేన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీజీపీ ట్రైనీ అధికారిని వెంటనే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మంజు ప్రస్తుతం మోహన్‌లాల్ అనే చిత్రంలో నటిస్తుంది. ఆమీ బయోపిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళీ రైటర్ కమలా డాడ్ పాత్ర పోషిస్తుంది.