ఏంటో ఈ మధ్య రాంగోపాల్ వర్మ టైం అసలు బాగాలేదు.. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియో తీసిన దగ్గర నుంచి వర్మపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. గతంలో హైదరాబాద్ లో ఓ మహిళపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. కేసు కూడా పెట్టారు.. పోలీస్ స్టేషన్ కు ఏనాడూ రాని వర్మ తొలిసారి పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కాడు.. అయితే తాజాగా వర్మపై మరో కేసు కూడా నమోదు చేశారు..
ఐద్వా మహిళా నేత మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా విశాఖపట్టణంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.. దీంతో విశాఖలో మహిళా సంఘాలు నిరాహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. పోర్న్ వీడియోలను ప్రమోట్ చేయడంతో పాటు మహిళలను కించపర్చేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలనే మహిళా సంఘాల డిమాండ్ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఏపీ హోం శాఖ మంత్రి చినరాజప్ప ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు..