ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి అభిమానులను నిరాశపరచిన సూర్య..

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 22, 2020, 03:49 PM



సినిమా తీయడం దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు అంతా టెన్షనే టెన్షన్. ఆ టెన్షన్ లో ఉన్నాడు తమిళ హీరో సూర్య. సినిమా అంతా పూర్తయి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా..ఏవో అడ్డంకులతో ఈ చిత్ర రిలీజ్ ఆగిపోతోంది. దాంతో ఫ్యాన్సే కాదు సూర్య కూడా నిరాశలోనే ఉన్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా. సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రం. ఈ చిత్ర రిలీజ్ కు మరోసారి బ్రేక్ పడింది. ప్రభుత్వం నుంచి మరికొన్ని అనుమతులు రావాల్సిన నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దాంతో తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులు నిరాశ చెందారు.హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు సూర్య. కాగా సూర్య తాజాగా నటించిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. ఇది వేసవిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇన్ని నెలల తర్వాత ఆ సినిమా ఓటీటీ లో విడుదలకు అమెజాన్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ నెల 30 న అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా మరోసారి ఈ మూవీ విడుదలకు బ్రేక్ పడింది.
దీపావళి కానుకగా నవంబర్ 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. గురు చిత్రం ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహించారు. నా బయోపిక్ లో నటించవద్దన్న క్రికెటర్..గుడ్ బై చెప్పిన హీరో కాగా ఈ చిత్రంలో సూర్య పైలట్ పాత్రలో కనిపిస్తాడు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2 డి ఎంటర్టైన్మెంట్ ..ఆస్కార్ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నిర్మాత గునీత్ మొంగాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కొన్నేళ్ళుగా సూర్య సినిమాలు వరుసగా బాక్సఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.ఈ సినిమాతో అయినా సూర్య భారీ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ కు పలు అడ్డంకులు ఎదురవుతుండటంతో సూర్య ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com