ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాతగా హీరోయిన్..

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 09:07 AM



ప్రొడ్యూసర్ గా మారనుంది హీరోయిన్ నమిత. ‘ఎంగల్‌ అన్నా’ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమైయింది నమిత. ‘మహానడిగన్‌’, ‘ఏయ్‌’, ‘ఇంగ్లీష్‌కారన్‌’, ‘చాణక్య’, ‘బిల్లా’, ‘బంబరకన్నాలే’, ‘ఆనై’, ‘నాన్‌ అవనిల్లై’, ‘ఇంద్రవిళా’ తదితర సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఆమె నటించారు. 2017లో వీరేంద్ర అనే యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమా ఛాన్సులు తగ్గిపోవటంతో టీవీ ఛానెల్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇటీవల బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో నమిత అకస్మాత్తుగా ఓ సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో తాను నటిస్తానని, హీరోయిన్‌కు ప్రాధాన్యమిచ్చే కథతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు నమిత  వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com