నీలికళ్లతో...నీలం రంగు టీ షర్టు ధరించి... గిరిజాల జుట్టుతో కూడిన పోనీటైల్ తో ముద్దులొలుకుతున్న చిన్నారి తైమూర్ అలీఖాన్ పటౌడీ ఫోటో నేడు ఇన్ స్టాగ్రామ్ లో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సినీ జంట సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ ల పూత్రరత్నమైన తైమూర్ అలీఖాన్ ఏడాది వయసులోనే ఇంటికి దూరంగా ఉన్న తన తండ్రి ఫోటోను తదేకంగా చూస్తుండగా క్లిక్ మనిపించిన తల్లి కరీనాకపూర్ ఆ ఫోటో చూసి నా హృదయం కరిగిందనే కామెంటుతో ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. తైమూర్ ఫోటో నేడు అంతర్జాలంలో వైరల్ అయింది. ఏడాది వయసులోనే తండ్రి ఊరెళ్లడంతో ఆయనపై ఉన్న అమిత ప్రేమతో ఫోటోను తదేకంగా చూస్తున్న చిత్రం అందరినీ కదిలించింది.