ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ 4: ఈ వారం నాగార్జున ప్లేస్ లో ఎవరు హోస్ట్ గా రానున్నారంటే..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 12:22 PM



రియాల్టీ షో అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకువచ్చే షో బిగ్ బాస్. స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్.. రికార్డు స్ధాయి రేటింగ్ తో దూసుకెళుతుంది. ఇండియాలోనే ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ లో నెంబర్ 1 ఛానల్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రకటించారు. ఈ షోకు టాలీవుడ్ కింగ్ నాగార్జున యాంకరింగ్ ఆదనపు ఆకర్షణ అని చెప్పచ్చు. అయితే.. నాగార్జున ఓ వైపు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేస్తూనే మరో వైపు వైల్డ్ డాగ్ మూవీ లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు నాగార్జున. దీంతో ఈ వారం బిగ్ బాస్ షోకు హోస్ట్ మారనున్నారు. లాస్ట్ వీకే హోస్ట్ మారతారు అనుకున్నారు కానీ... నాగ్ షోకు వచ్చారు. అయితే... ఈ వారం హోస్ట్ మారడం ఖాయం అంటున్నారు. ఇది తెలిసినప్పటి నుంచి ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మరి కింగ్ నాగ్ ను ఎవరు రీప్లేస్ చేస్తారా అన్న ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..? ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు దోచుకున్న సమంత.
అవును.. నాగ్ కోడలు సమంత ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ గా రానున్నారని వార్తలు వస్తున్నాయి. బిగ్ స్ర్కీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంత.. స్మాల్ స్ర్కీన్ పై కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com