ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ గోపాల్ వర్మ విచారణలో కొత్త ట్విస్ట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 11:06 AM



రామ్ గోపాల్ వర్మ తీసిన జీఎస్టీ షార్ట్ ఫిలిం వివాదం ఆయన్ను ఇప్పటిలో వదిలేలా లేదు. ఇంతవరకు కేవలం చిన్న చిన్న వివాదాలతో కాలం గడిపిన వర్మకు ఈ వివాదం మాత్రం కంటి మీట కునుకు లేకుండా చేస్తుంది. పోర్న్ స్టార్ తో సినిమా తీయడం ఫై పోలీసులు ఈయన్ను కొన్నిరోజుల క్రిత్రం సుమారు మూడు గంటల పాటు విచారణ జరిపి కీల విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది.


అయితే ఈ కేసు విషయమై రామ్ గోపాల్ వర్మను శుక్రవారం మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. ముంబై లో వున్నా వర్మ తనకు శుక్రవారం వీలుపడదని, సోమవారం అయితే హాజరవుతానని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే విచారణలో భాగంగా రామ్ గోపాల్ వర్మ లాప్ టాప్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానికి సంబందించిన ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ ఇంకా అందకపోవడంతో వర్మను మర్చి మొదటి వారం లో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. దీంతో రామ్ గోపాల్ వర్మకు ఈరోజు విచారణకు మినహాయింపు లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com