ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏక్ విలన్ 2 కృతి సనన్ ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 12:43 PM



కృతి సనన్.. 1 నేనొక్కడినే లో మహేష్ పక్కన నటించిన హీరోయిన్.. తెలుగులో దోచేయ్ లాంటి సినిమాలు చేసింది కానీ ఏమీ పెద్దగా హిట్ అవ్వకపోయేసరికి మళ్ళీ బాలీవుడ్ కి మకాం మార్చేసింది. అక్కడ బరేలి కి బర్ఫీ వంటి చిత్రాలతో హిట్లు అందుకుంటూ కెరీర్ బాగానే సెట్ చేసుకుంటూ వస్తున్న ఈమె ఇపుడు ఒక పెద్ద అవకాశం చేజిక్కించుకుంది. 


మోహిత్ సూరి దర్శకత్వంలో సిద్ధార్ట్ మల్హోత్రా - శ్రద్ధ కపూర్ ముఖ్య తారాగణంగా 2014 లో వచ్చిన ఏక్ విలన్ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాకు పొగిడింపు గా మరో సినిమా రాబోతోంది. ఇందులో మోహిత్ సూరి - కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయ్యారి సినిమా తో పర్వాలేదు అనిపించుకున్న సిద్దార్థ్. మల్హోత్రా నే సీక్వెల్ లో కూడా నటీసున్నాడు. ఏక్ విలన్ సినిమా శ్రద్ధ కపూర్ కు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాతో బిజీ అయిపోయిన శ్రద్ధ వరసగా సినిమాలు చేసుకుంటూనే వస్తోంది. మరి కృతి కూడా అలానే స్టార్ అవుతుంది అంటారా?


కెరీర్ లో ఒకటి రెండు తప్ప పెద్ద హిట్లు ఏమి లేవు కృతి కి. అందుకే ఏక్ విలన్ లాగానే ఏక్ విలన్ 2 కూడా పెద్ద హిట్ అయ్యి కృతి కి బ్రేక్ ఇస్తే ఈ సుందరి ఎంచక్కా సెటిల్ అయిపోవచ్చు. సినిమా గురించి మిగతా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com