ఏ రోల్ అయినా పూజా హెగ్డే ఎలాంటి సంకోచం లేకుండా నటిస్తుంది. ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం సినిమాల్లో నటించి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. పూజా తను నటిస్తున్న నాలుగో సినిమా అయిన సాక్ష్యంలో ఓ బ్రాహ్మిన్ అమ్మాయిగా కనిపించనుందట. సంప్రదాయ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ అమ్మాయిగా అలరించనుంది. ఈ రోల్‌ని ప్రత్యేకంగా పూజా కోసమే చిత్రబృందం డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ రోల్‌కు పూజా మాత్రమే పూర్తి న్యాయం చేయగలదని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. ఈ ముద్దుగుమ్మ కాస్ట్యూమ్స్ కూడా వెస్టర్న్, ఇండియన్ మిక్స్‌డ్‌గా ఉంటాయి. దీనికోసం డిజైనర్ నీత లుల్లా ఫాబ్యులస్ డిజైన్స్‌ని సిద్ధం చేస్తోందట. శ్రీవాస్ డైరెక్షన్లో సాక్ష్యం మూవీ తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమాలో పూజా నటించనుంది.