తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బాస్టర్ హిట్ సాంగ్స్ అందిస్తూ వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. లూసిఫర్ రీమేక్ కు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడు. లూసిఫర్ కోసం మ్యూజికల్ జర్నీని మొదలుపెట్టినట్టు థమన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.