ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ఆర్ఆర్' నుంచి మరో అప్ డేట్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 25, 2021, 02:00 PM



ఆర్ఆర్ఆర్' నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అనౌన్స్​మెంట్ రానుంది. విడుదల తేదీనే చెబుతారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం ప్రకటన వస్తుందో చూడాలి. అభిమానులంతా టాలీవుడ్​ పెద్ద సినిమాల అప్‌డేట్‌లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి ఒక విషయం బయటికి వచ్చింది.
ఈ సినిమాలో నటిస్తున్న ఐరిష్‌(ఐర్లాండ్‌) నటి అలిసన్‌ డూడీ ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది. అందులో 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. ఈ ఏడాది అక్టోబర్‌ 8న విడుదల కానుందంటూ ప్రకటించింది. ఆ పోస్టు వైరల్‌ కాకముందే వెంటనే తొలగించింది. ఆమె అనుకోకుండా చేసిన ఆ పోస్టులో నిజమెంత? అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com