సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. కన్నడ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. బెంగళూరులోని తన ఇంట్లో ఉరేసుకొని ఆమె బలవన్మరణంకు పాల్పడ్డారు. అయితే గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని సంధ్య కిరణ ఆశ్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ క్రమంలో డిప్రెషన్‌ను భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఉదయం నుంచి జయకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్లు చేస్తుండగా ఎత్తకపోవడంతో.. వారు ఆశ్రమ్కి ఫోన్లు చేశారు. దీంతో ఆశ్రమ్ నిర్వాహకులు ఆమె ఇంటికి వెళ్లగా.. అప్పటికే జయశ్రీ ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.