ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నటికి లైంగిక వేధింపులు!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 25, 2021, 05:42 PM



సినీ రంగలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎప్పుట్నుంచో ఉంది. హాలీవుడ్ టు టాలీవుడ్ ఈ వివాదంపై మీటూ అనే పెద్ద ఉద్యమమే జరిగింది. అయితే లేటెస్ట్ గా ఓ క్యాస్టింగ్ కౌచ్ వివాదం హాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇటాలియన్ నటి, డైరక్టర్ ఏషియా ఆర్జంటో చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ద ఫాస్ట్ అండ్ ఫురియస్ డైరక్టర్ రాబ్ కోహన్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయ్. 2002 లో XXX సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మూవీ డైరక్టర్ రాబ్ కోహన్ కూల్ డ్రింక్ తనకు మత్తు మందు ఇచ్చి రేప్ చేసినట్లు ఆమె తెలిపింది. " XXX సినిమా షూటింగ్ సమయంలో కోహన్ కూల్ డ్రింక్ తాగమని ఒత్తిడి చేశాడు. నేను ఆ కూల్ డ్రింక్ తాగాను. కానీ అందులో మత్తు మందు కలిపినట్లు ఉన్నారు. నేను నిద్ర లేచే సమయానికి బట్టల్లేకుండా అతని బెడ్ మీద ఉన్నాను " అని ఓ ఇటాలియన్ పత్రికకు ఏషియా ఆర్జంటో వెల్లడించింది. అయితే, నటి చేసిన వ్యాఖ్యల్ని కోహెన్ ప్రతినిధి ఖండించారు. " ఏషియా ఆర్జంటో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధరమైనవి. వారిద్దరికి మంచి వర్క్ రిలేషన్ షిప్ ఉంది. కోహెన్ ఆమెను తన స్నేహితురాలిగా భావించారు. 2002 లో ఆ విషయం జరిగితే..ఇప్పుడు చెప్పడం ఏదో అనుమానానికి తావిస్తోంది " అని కోహెన్ ప్రతినిధి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com