నటి హంసానందిని తాజాగా హఠ యోగినిలా మారిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. హంస యోగాభ్యాసం సూర్య నమస్కారాలకు అభిమానుల నుంచి స్పందన అంతే ఇదిగా ఉంది. ప్రకృతి రమణీయత పచ్చందాల నడుమ ఇదిగో ఇలా సూర్య నమస్కారాలను ఆచరిస్తోంది. అయితే ఆ భంగిమకు అలా పొట్టి ఫ్రాకునే ఎందుకు ఆశ్రయించింది? ఎందుకా థై సొగసుల ఎలివేషన్? అంటూ కామెంట్లు అంతే జోరుగా పడిపోతున్నాయ్. ఇటీవల వంటల కార్యక్రమాలతో ఇన్ స్టా వేదికగా వేడెక్కించిన హంస ఇంతలోనే యోగా గురూగా మారిపోయింది.. ఏం జరుగుతోంది? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.