ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివరాత్రికి పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్..

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 11:52 AM



పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రాలలోకెల్లా భారీ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమేనని చెప్పుకోవాలి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 17వ శతాబ్దం నాటి వాతావరణంలో పిరీడ్ మూవీగా నిర్మిస్తున్నారు. కోట్లు వెచ్చించి నాటి కాలాన్ని ప్రతిబింబించే వివిధ సెట్లను వేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా విభిన్నమైన గెటప్ లో ప్రేక్షకులకు కనిపించనున్నాడు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, సినిమా టైటిల్ ను కలిపి మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రం టైటిల్ని ఖరారు చేసినట్టు చెప్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా కోసం 'హరిహర మహాదేవ', 'వీరమల్లు' అనే రెండు టైటిల్స్ ను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేశారు. చివరికి రెండు టైటిల్స్ ను కలిపి 'హరిహర వీరమల్లు'గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com