బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఓ గుమ్మడి కాయ ఆకారంలో కనిపించేలా ఉన్న డ్రస్ ను ధరించి ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఓ నెటిజన్.. ఇదేం రకం డ్రెస్ అని ప్రశ్నించగా, ప్రియాంక అదిరిపోయే రిప్లై ఇచ్చింది.
"మేడమ్... ఇది నిజంగా డ్రస్సేనా? ఇటువంటివి వేసుకుంటే.. మంచి ఫిగర్ ఉన్నా లేనట్లే కదా?" అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనిపై ప్రియాంక స్పందించింది. "ఫిగర్, అందచందాలు అనేవి ముఖ్యం కాదని చెప్పడమే తన ఉద్దేశ్యం అని చెప్పింది. ఆమె సమాధానాన్ని చూసిన మిగతా నెటిజన్లు 'దటీజ్ ప్రియాంక' అంటూ ప్రియాంకను పొగుడుతున్నారు.