ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకోను: ప్రియా ప్రకాష్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 05:16 PM



మలయళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు తెరంగేట్రానికి సిద్ధమవుతోంది. నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన `చెక్` సినిమాలో ప్రియ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియ..అల్లు అర్జున్ గురించి మాట్లాడింది.
అల్లు అర్జున్‌కు కేరళలో భారీ స్థాయిలో అభిమానులున్నారు. నేను చిన్నప్పటి నుంచి బన్నీ సినిమాలు చూస్తూనే పెరిగాను. బన్నీ అంటే నాకెంతో అభిమానం. బన్నీ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందని, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదు. ఒకవేళ బన్నీ పక్కన నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోన`ని ప్రియ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com