ప్రస్తుతం హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా “నారప్ప” ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్ కు సన్నద్ధంగా ఉన్న విషయం కూడా తెలిసిందే. దీనితో పాటుగా మరో హిట్ చిత్రం “దృశ్యం 2” రీమేక్ లో వెంకీ మామ జెట్ స్పీడ్ తో నటిస్తున్నారు. ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో వెంకటేష్ తన పార్ట్ వరకు షూట్ మొత్తం కంప్లీట్ చేసేసినట్టు తెలుస్తుంది. మరి ఇది మాత్రం మామూలు స్పీడ్ కాదని చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు రీలీజ్ చేస్తారో ?