ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి కలిసి నటిస్తున్న 'విజయ్ - రష్మిక'

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 04:24 PM



టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జోడీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'గీతగోవిందం' సినిమాలో 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అంటూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన ఈ జంట.. 'డియర్ కామ్రెడ్' మూవీతో మరోసారి జతకట్టారు. సిల్వర్ స్క్రీన్ పై మంచి జోడీ అనిపించుకున్న వీరిద్దరూ రియల్ లైఫ్ లో రిలేషన్ షిప్ లో ఉన్నారని అప్పట్లో పుకార్లు ఓ రేంజ్ లో పుట్టుకొచ్చాయి. హీరో రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం ఇదేనని గుసగుసలు వినిపించాయి. కానీ ఇవేవీ పట్టించుకోని ఈ క్రేజీ జంట..ఇప్పుడు మరోసారి విజయ్ - రష్మిక కలిసి నటించినట్లు తెలుస్తోంది. కాకపోతే అది ఏ సినిమా కోసమో అనుకుంటే పొరపాటే. వీరిద్దరూ కలిసి నటించింది ఓ కమర్షియల్ యాడ్ కోసం.సంతూర్ ప్రొడక్ట్ కొత్త బ్రాండ్ అంబాసిడర్స్ గా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరితో ఇటీవల యాడ్ షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ మోకాళ్లపై కూర్చొని రష్మికకు ఓ గిఫ్ట్ అందిస్తున్నట్లు ఈ యాడ్ లో కనిపిస్తున్నారు. వెండితెరపై ఫర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకున్న విజయ్ - రష్మిక సంతూర్ యాడ్ తో మరోసారి అలరించబోతున్నారు. ఇకపోతే వీరిద్దరూ ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నారు. విజయ్ 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తుంటే.. 'మిషన్ మజ్ను' సినిమాతో రష్మిక బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. రెండు సినిమాల షూటింగ్స్ ముంబై లోనే జరుగుతుండటంతో ఇద్దరూ వీలైనప్పుడల్లా కలుస్తున్నారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com