సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్‌లో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో వచ్చే రెండవ సీజన్‌పై మంచి అంచనాలున్నాయి. ఈ సెకండ్ సీజన్లో సమంత విలన్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్. సమంత ఈ వెబ్ సీరీస్‌లో రాజీ పాత్రలో కనిపించనుంది. ఓ టెర్రరిస్టుగా కనిపించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడెప్పుడు ఈ సెకండ్ సీజన్ స్ట్రీమ్ అవుతుందని ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ జూన్ 11న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని తాజా సమాచారం. అయితే అమెజాన్ ప్రైమ్ నుండి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇప్పటికే హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ డబ్బింగ్ పనులు కూడ పూర్తయ్యాయట. దీంతో జూన్11న పార్ట్2 హిందీలో విడుదలైతే ఇతర భాషల్లో కూడ అదే రోజున రిలీజ్ అవుతుందని టాక్.
ఇక ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్లో మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండో సీజన్లో సమంత మరో ప్రధాన పాత్ర పోషించనుంది. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.