“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రెజీనా “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఒక కొరియన్ మూవీ తెలుగు, తమిళ రీమేక్ మూవీస్ కు రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు , తమిళ రీమేక్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ఈ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ కి టైటిల్ గా “శాకినీ ఢాకినీ ” పరిశీలనలో ఉంది. ఈ మూవీ లో ట్రైనీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రెజీనా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు.