ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంక చోప్రా భర్త కు ఆక్సిడెంట్‌.. హాస్పిటల్‌లో చేరిక

cinema |  Suryaa Desk  | Published : Mon, May 17, 2021, 12:02 PM



ప్రియాంక చోప్రా  భర్త ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్.. షూటింగ్ సెట్‌లో ఆక్సిడెంట్‌కు గురయ్యారు. ఈ సంఘటన శనివారం రాత్రి లాస్ ఏంజెల్స్‌లో ఈయన షూటింగ్ చేస్తున్న సెట్‌లో జరిగింది. ఈ ఘటనలో నిక్ కు పెద్దగా గాయాలు కాకపోయినా.. ఆయన్ని వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేసారు. డాక్టర్లు  గాయాలైన చోట చికిత్స చేసిన అనంతరం ఆదివారం డిస్‌ఛార్జ్ చేసారు. ఐతే.. నిక్ గాయాలతో యదావిధిగా సోమవారం మాత్రం.. తన రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొనబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం నిక్, ప్రియాంక ఇద్దరు తమ కున్న సినిమా కమిట‌్‌మెంట్స్ కారణంగా విడివిడిగా ఉంటున్నారు. ప్రియాంక చోప్రా విషయానికొస్తే.. హాలీవుడ్, బాలీవుడ్ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు తనది. బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంటూ గ్లోబల్ స్థాయి నటిగా మన్ననలు అందుకుంటోంది.


ముఖ్యంగా ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ తో వివాహం తర్వాత ఈ జంట చాలాసార్లు వార్తల్లో నిలిచింది. ఇటీవలే ప్రియాంక చోప్రా త‌న ఆటోబయోగ్రఫీ 'అన్‌ఫినిష్డ్' పుస్త‌కాన్ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. మార్కెట్‌లో విడుద‌లైన వారంలోపే ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో చేరి.. లెక్కలేనన్ని కాపీలు అమ్ముడుపోయింది. నిక్ తో పెళ్లి విషయంలో తన తల్లి అయిన మధు చోప్రా ఎంతో కీలక పాత్ర పోషించిందని ఈ పుస్తకంలో ప్రియాంక తెలిపింది. ఈ విషయం గురించి ఓప్రా ఆమెను అడగ్గా ఈ విధంగా బదులిచ్చింది. ప్రియాంక చోప్రా హిందీలో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న నటిగా రికార్డులకు ఎక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com