ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్‌ సినిమా లో విలన్ గా ఓకే అయిన సేతుపతి

cinema |  Suryaa Desk  | Published : Tue, May 18, 2021, 09:38 AM



తమిళ నటుడు విజయ్‌ సేతుపతి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. డేట్లు అడ్జస్ట్‌ చేయలేక ఆయన అంగీకరించిన కొన్ని చిత్రాల నుంచి తప్పుకున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడుగా నటిస్తున్న 'విక్రమ్‌' చిత్రంలో విలన్‌ పాత్రకు సేతుపతిని తీసుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ''డేట్లు సర్దుబాటు చేయలేక ఇంకా నిర్ణయం తీసుకోలేదు'' సేతుపతి ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. అయితే ఆయన 'విక్రమ్‌' చిత్రంలో నటించటం దాదాపు ఖరారు అయిందని కోలీవుడ్‌ సమాచారం. త్వరలోనే సేతుపతి ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారని టాక్‌. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com