ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లీకైన మెగాస్టార్‌ లుక్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 14, 2018, 03:21 PM



బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ మిష్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ కలిసి నటిస్తున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’  సినిమా లుక్‌ లీకైంది. ఈ సినిమాలో అమితాబ్‌ పాత్రకు సంబంధించిన లుక్‌ అంటూ ఓ ఫోటో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ పోస్టర్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్‌ తెగ షేర్‌  చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. కానీ, దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఆమిర్‌ఖాన్‌కు సంబంధించిన లుక్స్‌ బయటకు వచ్చి, ఫ్యాన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాను యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో ఫిలిఫ్‌ మెడోస్‌ టేలర్‌ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. అసలే బిగ్‌ బీ, సీనియర్‌ నటుడు అయిన అమితాబ్‌, ఆమిర్‌ఖాన్‌ కలిసి నటిస్తుండటంతో బాలీవుడ్‌ దృష్టి మొత్తం ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం తెలిసినా బీటౌన్‌ మొత్తం చర్చించుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com