ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమెకు ఒక్కసారి లిప్ కిస్ పెడితే..

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 12:33 PM



కన్నడ నటుడు ధనంజయ్ మంచి జోష్ మీద ఉన్నాడు. ఆయన నటించిన టగరు చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. దీనితో ధనంజయ్ సంతోషానికి అవధులు లేకుండా పోతోంది. ఆ సంతోషంలో తాను మాట్లాడుతున్నది వివాదాస్పదమా కాదా అనికూడా గమనించుకోవడం లేదు. శివకుమార్, ధనంజయ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన టగరు చిత్రం మూడు రోజుల్లోనే 10 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ధనుంజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ధనంజయ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.ధనంజయ్ 2013 లో వచ్చిన డైరెక్షర్స్ స్పెషల్ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తొలి చిత్రమథోతోనే సైమా అవార్డు దక్కించుకుని సత్తా చాటాడు.ఇటీవల ధనంజయ్ నటించిన టగరు చిత్రం ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. దీనితో ఈ హీరో సంతోషానికి అవధులు లేకుండా పోతోంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ధనంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే ఏ హీరోయిన్ ని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు దీపికాపదుకునే అని సమాధానం ఇచ్చాడు. ఆమెకు ఒక్కసారి లిప్ కిస్ పెడితే చాలని అలాంటి అవకాశం వస్తే వదులుకోనని సమాధానం ఇచ్చాడు.కన్నడ అభిమానులే ప్రస్తుతం ధనంజయ్ ని ట్రోల్ చేస్తున్నారు. హిట్టు పడేసరికి మాటలు అదుపుతప్పుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com