ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రియ హోమ్లీ హౌస్ వైఫ్ లా ..

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 01:04 PM



ప్రస్తుతం సౌత్ లో ఉన్న సీనియర్ హీరోయిన్స్ లలో శ్రియ శరన్ ఒకరు. అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్లు గడుస్తోంది. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా దాదాపు అందరిని కవర్ చేసేసింది. స్టార్ హీరోలతో చాలా సినిమాలను చేసి కెరీర్ ను ఓ లెవెల్లో సెట్ చేసుకుంటోంది. ఇప్పటికి కూడా ప్రయోగాత్మకమైన కొన్ని కథల్లో అమ్మడికి ఛాన్స్ ఇవ్వక తప్పడం లేదు. ఎందుకంటే సీనియర్ హీరోల సరసన కొంచెం మీడియం ఏజ్ లో అందంగా కనిపించాలంటే శ్రియ లాంటి వారే కరెక్ట్. 


హోమ్లీ క్యారెక్టర్ అయినా గ్లామర్ గర్ల్ గా అయినా కూడా శ్రియ పాత్రలో ఒదిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే శ్రియ మరో సీనియర్ హిరోతో జతకట్టడానికి రెడీ అవుతోంది. తేజ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా ఆట నాదే వేట నాదే అనే సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. అందులో శ్రీయ ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందట. 


అయితే రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక ఫొటో షూట్ నిర్వహించారు. అందులో శ్రియ హోమ్లీ హౌస్ వైఫ్ లా కనిపిస్తోంది. చీరకట్టులో ఒక మధ్యతరగతి ఇల్లాలు ఎలా ఉందొ అలా కనిపించింది. శ్రియ ఇంతకుముందు వెంకీతో సుభాష్ చంద్రబోస్ - గోపాల గోపాల సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ సినిమాల్లో హోమ్లీగానే కనిపించింది. ముడవసారి కూడా వెంకీ ఇల్లాలి పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యింది.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com