ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 03:15 PM



ఒక్క కన్ను మీటుతో అంతర్జాల ప్రపంచాన్ని కుదిపేసింది మలయాళ నటి ప్రియా వారియర్‌. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఏ పాటి క్రేజు ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజును సొమ్ము చేసుకునే పనిలో పడిన ఈ మలయాళ సినీ నటి...పలు సినిమా ఆఫర్స్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ యాడ్స్‌ను కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. తాజాగా దివా ఉమెన్స్ వస్త్రాల బ్రాండ్ కోసం ఫోటోషూట్ చేసింది. అందులోని ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా...ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రియా వారియర్ అచ్చం యువరాణిలా ఉందంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. 


ఇటీవల హోలీ సెలబ్రేషన్స్ వీడియోను ప్రియా వారియర్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసుకుంది. ఈ వీడియోకు దాదాపు 2.8 మిల్లియన్ల వ్యూస్ వచ్చాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com